గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలడంతో దంపతులు మృతిచెందారు.
వేపాడు(విజయనగరం): గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు బాగా నానిన మట్టిగోడల ఇల్లు కూలడంతో దంపతులు మృతిచెందారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా వేపాడు మండలం బొప్పునాయుడుపేట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన కర్రి అప్పారావు(86), అతని భార్య నాగమ్మ(75) ఇంట్లో నిద్రిస్తుండగా.. వర్షాలకు నాని ఉన్న మట్టిగోడలు ఒక్కసారిగా కుప్పకూలాయి. భారీ శబ్ధం రావడాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు ఘటనాస్థలికి చేరుకొని సహాయకు చర్యలు చేపట్టారు. అప్పటికే ఆ దంపతులు మట్టి పెళ్లలు మీదపడి మృతిచెందారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.