జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసే అధ్యాపక పోస్టులను ప్రభుత్వం రెన్యువల్ చేయకపోవడంతో వారందరూ సామూహిక సెలవుల్లో వెళ్లారు.
సామూహిక సెలవులో కాంట్రాక్ట్ అధ్యాపకులు
Jul 25 2016 11:59 PM | Updated on Sep 4 2017 6:14 AM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసే అధ్యాపక పోస్టులను ప్రభుత్వం రెన్యువల్ చేయకపోవడంతో వారందరూ సామూహిక సెలవుల్లో వెళ్లారు. దీంతో జిల్లాలో విద్యా బోధన నిలిచిపోయింది. జిల్లాలోని 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 303 మంది అధ్యాపకులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 28వ తేదీతో వీరి కాంట్రాక్ట్ గడువు ముగిసింది. అయినా రెన్యువల్ అవుతుందనే ఆశతో అప్పటి నుంచి కళాశాలలకు వచ్చి పని చేస్తున్నారు. అయితే వారి పోస్టులను ప్రభుత్వం ఇప్పటి వరకు రెన్యువల్ చేయలేదు. ఈ విషయమై పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో సోమవారం సామూహిక సెలవుల్లో వెళ్లిపోయారు. పత్తికొండ, కోడుమూరు, హŸళగుంద, కేవీఆర్ కళాశాలల్లో అందరూ సెలవులో వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా 15 కళాశాలల్లో 46 మంది సెలవులో ఉన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే మంగళవారం మరిన్ని కళాశాలల అధ్యాపకులు సెలవులో వెళ్లిపోయే అవకాశం ఉంది.
ఆర్‌జేడీకి నివేదిక పంపాం: సీడీ కబీరు, డీవీఈఓ
Advertisement
Advertisement