దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలాన్ని వికారాబాద్‌లో కలుపొద్దని డిమాండ్ చేస్తూ ఆదివారం మండల కేంద్రంలో మహిళలు మానవహారం నిర్వహించారు.
పాలమూరులోనే కొనసాగించాలి
Aug 21 2016 9:26 PM | Updated on Mar 29 2019 9:14 PM
దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలాన్ని వికారాబాద్‌లో కలుపొద్దని డిమాండ్ చేస్తూ ఆదివారం మండల కేంద్రంలో మహిళలు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కూరవెంకటయ్య మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గాన్ని పాలమూరులోనే ఉంచాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన దౌల్తాబాద్‌ను వికారాబాద్‌లో కలిపితే ఆర్థిక, విద్యపరంగా మరింత వెనకబడుతుందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పార్వతమ్మ, సీపీఎం నాయకులు రాజు తదితరులున్నారు.
Advertisement
Advertisement