మండలంలోని భోరజ్ గ్రామానికి చెందిన పొద్దుటూరి సుభద్రబాయి ఆదివారం ఉదయం మృతి చెందడంతో రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న భోరజ్ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మంత్రి పరామర్శ
Aug 28 2016 8:17 PM | Updated on Aug 30 2019 8:37 PM
జైనథ్ : మండలంలోని భోరజ్ గ్రామానికి చెందిన పొద్దుటూరి సుభద్రబాయి ఆదివారం ఉదయం మృతి చెందడంతో రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న భోరజ్ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏఎంసీ వైస్ చైర్మెన్ ఎల్టి భూమారెడ్డి సమీప బంధువు అయిన సుభద్రబాయి వయసు పైబడంతో మృతి చెందింది. పరామర్శలో భాగంగా మంత్రి మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మంత్రి వెంట నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, అడ్డి భోజారెడ్డి, తల్లెల చంద్రయ్య, పెందూర్ దేవన్న, సర్సన్ లింగా రెడ్డి, తదితరులు ఉన్నారు.
Advertisement


