కాంగ్రెస్‌ను ఏ పార్టీ ఎదుర్కోలేదు | Congress has been met with any party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను ఏ పార్టీ ఎదుర్కోలేదు

Aug 12 2013 2:55 AM | Updated on Mar 18 2019 9:02 PM

నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదని రాష్ర్ట బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు.

పరకాల, న్యూస్‌లైన్ :  నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదని రాష్ర్ట బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. విద్యార్థుల బలిదానాలను అర్థం చేసుకున్న యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుపై సీడబ్ల్యూసీ చేసిన ప్రకటనను హర్షిస్తూ పరకాలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబారి సమ్మారావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

 ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి బస్వరాజు సారయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. తెలంగాణ కోసం 56 ఏళ్ల నుంచి కొనసాగుతున్న పోరాటం సోనియా గాంధీతో నెరవేరిందని చెప్పారు. సీడబ్ల్యూసీలో ఏకవాక్య తీర్మాణంపై తెలంగాణ ప్రకటన చేయించిన ఘనత సోనియాకే దక్కుతుందన్నారు. తెలంగాణ ఉంటున్న సీమాంధ్రులను మన కుటుంబ సభ్యులేనని, రాష్ర్టం ఏర్పడిన తర్వాత వారిని అన్నదమ్ముల్లా చూడాలని ప్రజలకు సూచించారు.

 తెచ్చింది.. ఇచ్చింది..  కాంగ్రెస్సే : ఎంపీ సిరిసిల్ల రాజయ్య
 తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది.. తెచ్చింది.. కాంగ్రెస్ ప్రభుత్వమేనని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నాలుగుకోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేందుకే సోనియాగాంధీ రాష్ర్ట ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమ ని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన  విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిందన్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌తో సహా తొమ్మిది జిల్లాల్లో నివాసముంటున్న సీమాంధ్రులకు, వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండి సారంగపా ణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మడికొండ సం పత్, నాయకులు బస్వోజు సురేష్, తిరుపతి రెడ్డి, కళావతి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement