'ముందు మంత్రులతో తాగించండి' | congress blames kcrs liquor policy | Sakshi
Sakshi News home page

'ముందు మంత్రులతో తాగించండి'

Aug 25 2015 7:01 PM | Updated on Mar 18 2019 9:02 PM

'ముందు మంత్రులతో తాగించండి' - Sakshi

'ముందు మంత్రులతో తాగించండి'

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న చీప్ లిక్కర్ పాలసీపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కమీషన్ల కోసమే చీప్ లిక్కర్ ను తెస్తున్నారని జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులు విమర్శించారు.

కరీంనగర్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న చీప్ లిక్కర్ పాలసీపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కమీషన్ల కోసమే చీప్ లిక్కర్  ను తెస్తున్నారని జీవన్ రెడ్డి,  శ్రీధర్ బాబులు విమర్శించారు. చీప్ లిక్కర్ తాగితే ఆయుష్షు పెరుగుతుందంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ముందుగా మంత్రులతో చీప్ లిక్కర్ తాగించాలని ఎద్దేవా చేశారు.

 

గీత కార్మికుల పొట్ట కొట్టేలా చీప్ లిక్కర్ తెస్తే చూస్తూ ఊరుకోమన్నారు. జగిత్యాల నుంచి చీప్ లిక్కర్ వ్యతిరేక ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. చీప్ లిక్కర్, గుడాంబాను ఆరికట్టే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement