ఏఎస్పీని సన్మానిస్తున్న సభ్యులు
ఇటీవల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఆదిలాబాద్ ఏఎస్పీ జీఆర్ రాధికను రాష్ట్ర పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు గోపినాథ్‌రెడ్డి సన్మానించారు.
ఆదిలాబాద్ : ఇటీవల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఆదిలాబాద్ ఏఎస్పీ జీఆర్ రాధికను రాష్ట్ర పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు గోపినాథ్‌రెడ్డి సన్మానించారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పోలీసు అసోసియేషన్ అధ్యక్షులు అశోక్, సురేందర్, బొర్లకుంట పోచలింగంలతో కలిసి పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఏఎస్పీ జీఆర్ రాధికను కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గోపినాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఏఎస్పీ రాధిక ఎవరెస్టు శిఖరం అధిరోహించడంతో తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు శాఖకు ఆమె ఆణిముత్యమని కొనియాడారు. యావత్ తెలంగాణ పోలీసులు దీనిని గర్వంగా భావిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఉట్నూర్ డీఎస్పీ ఎస్.మల్లారెడ్డి, పోలీసు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మీర్ విరాసత్‌అలీ పాల్గొన్నారు.