పట్టుదలతోనే పతకాల సాధన | Confidence makes to get medals | Sakshi
Sakshi News home page

పట్టుదలతోనే పతకాల సాధన

Nov 5 2016 8:42 PM | Updated on Sep 4 2017 7:17 PM

పట్టుదలతోనే పతకాల సాధన

పట్టుదలతోనే పతకాల సాధన

పట్టుదల, క్రమశిక్షణతో రాణిస్తే విజయాలు సొంతం చేసుకోవచ్చని ఆర్‌వీఆర్‌ కాలేజీ ఆధ్యాపకులు కొల్లా శ్రీనివాసరావు..

గుంటూరు స్పోర్ట్స్‌: పట్టుదల, క్రమశిక్షణతో రాణిస్తే విజయాలు సొంతం చేసుకోవచ్చని ఆర్‌వీఆర్‌ కాలేజీ ఆధ్యాపకులు కొల్లా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఏసీ కళాశాల ఎదురు గల ఉల్ఫ్‌ హాలులోని ఆంధ్ర క్రిస్టియన్‌ కళాశాల చిన్నారులకు టెన్నిస్‌ సెంటర్‌లో శనివారం టాలెంట్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన శ్రీనివాసరావు విజేతలకు పతకాలు బహూకరించారు. అనంతరం మాట్లాడుతూ టోర్నమెంట్‌లు క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడుతాయన్నారు. టెన్నిస్‌ సెంటర్‌ కోచ్‌ ఎం.ఇజ్రాయిల్‌ మాట్లాడుతూ క్రీడలపై చిన్నారుల్లో ఆసక్తి కల్గించేందుకు టోర్నమెంట్‌లు నిర్వహించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ వై.షేక్, సీనియర్‌ క్రీడాకారుడు జోయల్, అస్టింట్‌ కోచ్‌లు జయకర్, గోపి, సురేంద్ర, క్రీడాకారులు మనోహర్, చేతన్, రామ్‌చరణ్, చేతన్‌ ప్రాఖ్యత్‌ రెడ్డి, షేక్‌ చిష్టి, కొల్లా గోష్‌ప«ద్‌నాథ్, విహర్, జితేంద్ర నాగసాయి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement