కమ్యూనికేషన్‌ అభ్యర్థులకు ఊరట | Communication candidates relief | Sakshi
Sakshi News home page

కమ్యూనికేషన్‌ అభ్యర్థులకు ఊరట

Aug 2 2016 11:57 PM | Updated on Mar 19 2019 9:03 PM

కమ్యూనికేషన్‌ అభ్యర్థులకు ఊరట - Sakshi

కమ్యూనికేషన్‌ అభ్యర్థులకు ఊరట

జిల్లాలోని పోలీస్‌ కానిస్టేబుళ్ల ఎంపిక కోసం జరుగుతున్న పోటీల్లో సాంకేతిక లోపం వల్ల పోలీస్‌ విభాగం, కమ్యూనికేషన్‌ విభాగంలో ఒకేసారి పాల్గొనాల్సిన అభ్యర్థులు ఈనెల 5వ తేదీన నిర్వహించే దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని రూరల్‌ ఎస్పీ అంబర్‌ కిషోర్‌ఝూ ఒక ప్రకటనలో తెలిపారు.

 
  • 5వ తేదీన హాజరయ్యేందుకు అవకాశం
  • రూరల్‌ ఎస్పీ అంబర్‌ కిషోర్‌ ఝా
వరంగల్‌ : జిల్లాలోని పోలీస్‌ కానిస్టేబుళ్ల ఎంపిక కోసం జరుగుతున్న పోటీల్లో సాంకేతిక లోపం వల్ల పోలీస్‌ విభాగం, కమ్యూనికేషన్‌ విభాగంలో ఒకేసారి పాల్గొనాల్సిన అభ్యర్థులు ఈనెల 5వ తేదీన నిర్వహించే దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని రూరల్‌ ఎస్పీ అంబర్‌ కిషోర్‌ఝూ ఒక ప్రకటనలో తెలిపారు. కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో పోలీస్‌ విభాగం, కమ్యూనికేషన్‌ విభాగాల్లో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒకే రోజున దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించే విధంగా టైం టేబుల్‌ ఇచ్చినట్లు తమ కు సమాచారం అందిందన్నారు. దీనివల్ల అభ్యర్థులు రెండు విభాగాల్లో హాజరయ్యేం దుకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్నామన్నారు. కమ్యూనికేషన్‌ విభాగంలో ఎంపిక కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తెలిపారు. 
 
కేయూలో 1,118 మందికి పరీక్షలు
వరంగల్‌ రూరల్‌ జిల్లా పోలీసు పరిధిలో కాని స్టేబుళ్ల భర్తీ కోసం ఎంపిక చేసేందుకు కేయూ మైదనంలో మంగళవారం 1,118 మందికి ప రుగు పందెం నిర్వహించారు.  అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను రూరల్‌ ఎస్పీ అంబర్‌ కిషోర్‌ఝూ పర్యవేక్షించారు. రూరల్‌ అదనపు ఎస్పీ జాన్‌ వెస్లీ, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ములుగు ఏఎస్పీ వి శ్వజిత్‌ కంపాటీ, డీఎస్పీలు రాజామహేంద్ర నాయక్, సత్యనారాయణరెడ్డి, సుదీంద్ర, రాంచందర్‌రావు, కుమారస్వామి, సీఐలు, ఎస్పైలు, ఆర్‌ఐలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement