హోరాహోరీగా కర్రసాము పోటీలు | colour tauch competeions compleated | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా కర్రసాము పోటీలు

Jul 21 2016 9:24 PM | Updated on Sep 4 2017 5:41 AM

హోరాహోరీగా కర్రసాము పోటీలు

హోరాహోరీగా కర్రసాము పోటీలు

బాపట్ల : కర్రసాము రంగు టచ్‌పోటీలు ఎంతో హోరాహోరీగా గురువారం రాత్రితో ముగిశాయి. గొల్ల ఆదినారాయణ మెమోరియల్‌ ఆధ్వర్యంలో బుధ, గురువారం పోటీలు నిర్వహించారు.

  బాపట్ల :  కర్రసాము రంగు టచ్‌పోటీలు ఎంతో హోరాహోరీగా గురువారం రాత్రితో ముగిశాయి. గొల్ల ఆదినారాయణ మెమోరియల్‌ ఆధ్వర్యంలో బుధ, గురువారం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 30 మంది పాల్గొన్నారు. వీరిలో వేల్పుల వెంకటేశ్వర్లు మొదటిబహుమతి, ద్వితీయ తన్నీరు శేషవెంకటశివప్రసాద్, తతీయ శవనం సాంబిరెడ్డి సొంతం చేసుకున్నారు. వీరనారాయణ, నక్కా వెంకట్రావు సొంతం చేసుకున్నారు. కమిటీ సభ్యులుగా చిల్లర వెంకటేశ్వర్లు నాయుడు, షేక్‌ అల్లాభక్షి, మేడిబోయిన విష్ణునారాయణరెడ్డి, ఆర్‌.వెంకటప్పయ్యనాయుడు, గొల్ల సుబ్రహ్మణ్యం, చెరుకూరి జయపాల్, సూర్యనారాయణరెడ్డి, వేల్పుల శ్రీనివాస్, మన్నెం చిన్న, శవనం రాంబాబురెడ్డి, టి.యోబు వ్యవహరించారు. మొదటి బహుమతిగా రూ.10,116 విలువచేసే వెండి తోడా, రెండో బహుమతిగా రూ.5116 విలువ చేసే వెండి తోడా, మూడో బహుమతిగా రూ.3116 విలువ చేసే వెండి తోడాను అందజేశారు. బహుమతులను వేగేశన ఫౌండేషన్‌ చైర్మన్‌ నరేంద్రవర్మ చేతుల మీదుగా అందించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement