రూ.62.15 కోట్లతో కళాశాలల అభివృద్ధి | Colleges development with Rs.62.15 crores | Sakshi
Sakshi News home page

రూ.62.15 కోట్లతో కళాశాలల అభివృద్ధి

Sep 12 2016 11:30 PM | Updated on Sep 4 2017 1:13 PM

రూ.62.15 కోట్లతో కళాశాలల అభివృద్ధి

రూ.62.15 కోట్లతో కళాశాలల అభివృద్ధి

కోవూరు: రాష్ట్రంలో ఇంటర్‌ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.62.15 కోట్లు మంజూరు చేసిందని ఆర్‌జేడీ వై.పరంధామయ్య తెలిపారు. కోవూరు టీఎన్‌సీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సోమవారం ఆయన పరిశీలించారు.

 
కోవూరు: 
రాష్ట్రంలో ఇంటర్‌ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.62.15 కోట్లు మంజూరు చేసిందని ఆర్‌జేడీ వై.పరంధామయ్య తెలిపారు. కోవూరు టీఎన్‌సీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వృత్తి విద్యా కోర్సులను బలోపేతం చేసేందుకు నూతనంగా ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్లు్య కోర్సులు ప్రవేశ పెడుతున్నామన్నారు. ఈ కోర్సులను ఇప్పటికే ఆత్మకూరు, నెల్లూరు, నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట, కావలి ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. ఎంఎల్‌టీ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతి కళాశాలకు కంప్యూటర్లను అందచేశామన్నారు. త్వరలో శ్రీ సిటీకి అనుసంధానంగా ఒక వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. 
ఏ కళాశాలకు ఎన్ని నిధులంటే..
కోవూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల రూ.1.50 కోట్లు, దామరమడుగు రూ.62లక్షలు, దగదర్తికి రూ.1.28 కోట్లు, మనుబోలు రూ.1.85కోట్లు  వెంగమాంబ పురం రూ.1.90కోట్లు, రాపూరు రూ.1.90 కోట్లు నాబార్డు కింద విడుదలకు సంబం«ధించి ఆదేశాలు కూడా వచ్చాయన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జోన్‌ 3లో 120 జూనియర్‌ అధ్యాపక పోస్టులు భర్తీ కావాల్సి ఉందన్నారు. వీటి స్థానంలో గెస్ట్‌ అధ్యాపకులతో భర్తీ చేయాలని సూచించామన్నారు. అందుకు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. కళాశాలలో శిథిలావస్థకు చేరుకొని ఉన్న గదులను ఆయన క్షుణంగా పరిశీలించారు. అనంతరం కళాశాల అధ్యాపక సిబ్బంది ఆర్‌జేడీ పరంధామయ్యను సన్మానించారు. కార్యక్రమంలో వి.వెంకటసుబ్బయ్య, అధ్యాపకులు సురేష్, వెంకటేశ్వర్లు, రాఘవయ్య, విష్ణువర్థన్, గోపి, సతీష్, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, సురేష్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement