breaking news
RJD parandhamaiah
-
క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు
ఘనంగా విశ్వసాయి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం నెల్లూరు(టౌన్): పట్టుదల, క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని రీజనల్ జాయింట్ డైరక్టర్ పరంధామయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక గోమతినగర్‌లోని పావనిగార్డెన్స్‌లో విశ్వసాయి విద్యాసంస్థల ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరంధామయ్య మాట్లాడుతూ ఉత్తీర్ణత శాతంలో 4వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మొదటి స్థానంలోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రతిభా అవార్డులకు జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు ఎంపిక కాగా, వారిలో ఇద్దరు విశ్వసాయికి చెందినవారన్నారు. ఆర్ఐఓ బాబూజాకబ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కమ్యూనికేషన్ సిల్క్స్పై ప్రత్యేక శ్రద్థ తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్రముఖ కార్డియాలజిస్టు శ్రీనివాసరాజు, ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కళాశాల చైర్మన్, వైస్ చైర్మన్లు సత్యనారాయణ, కృష్ణమోహన్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం 80 మంది విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో సీట్లు సాధించడమే కాకుండా పలు ప్రవేశ పరీక్షల ద్వారా ఎంతోమంది స్కాలర్‌షిప్‌లకు ఎంపికైనట్లు చెప్పారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ జితేంద్ర, శివశంకర్, శ్రీరామ్‌రెడ్డి, సుబ్బరాయుడు, జనరల్ మేనేజర్ రాజేష్‌కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
రూ.62.15 కోట్లతో కళాశాలల అభివృద్ధి
కోవూరు: రాష్ట్రంలో ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.62.15 కోట్లు మంజూరు చేసిందని ఆర్జేడీ వై.పరంధామయ్య తెలిపారు. కోవూరు టీఎన్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వృత్తి విద్యా కోర్సులను బలోపేతం చేసేందుకు నూతనంగా ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్లు్య కోర్సులు ప్రవేశ పెడుతున్నామన్నారు. ఈ కోర్సులను ఇప్పటికే ఆత్మకూరు, నెల్లూరు, నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట, కావలి ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. ఎంఎల్టీ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతి కళాశాలకు కంప్యూటర్లను అందచేశామన్నారు. త్వరలో శ్రీ సిటీకి అనుసంధానంగా ఒక వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. ఏ కళాశాలకు ఎన్ని నిధులంటే.. కోవూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల రూ.1.50 కోట్లు, దామరమడుగు రూ.62లక్షలు, దగదర్తికి రూ.1.28 కోట్లు, మనుబోలు రూ.1.85కోట్లు వెంగమాంబ పురం రూ.1.90కోట్లు, రాపూరు రూ.1.90 కోట్లు నాబార్డు కింద విడుదలకు సంబం«ధించి ఆదేశాలు కూడా వచ్చాయన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జోన్ 3లో 120 జూనియర్ అధ్యాపక పోస్టులు భర్తీ కావాల్సి ఉందన్నారు. వీటి స్థానంలో గెస్ట్ అధ్యాపకులతో భర్తీ చేయాలని సూచించామన్నారు. అందుకు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. కళాశాలలో శిథిలావస్థకు చేరుకొని ఉన్న గదులను ఆయన క్షుణంగా పరిశీలించారు. అనంతరం కళాశాల అధ్యాపక సిబ్బంది ఆర్జేడీ పరంధామయ్యను సన్మానించారు. కార్యక్రమంలో వి.వెంకటసుబ్బయ్య, అధ్యాపకులు సురేష్, వెంకటేశ్వర్లు, రాఘవయ్య, విష్ణువర్థన్, గోపి, సతీష్, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, సురేష్ పాల్గొన్నారు.