క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు | Discipline leads to success | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు

Sep 25 2016 11:44 PM | Updated on Oct 20 2018 6:19 PM

క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు - Sakshi

క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు

నెల్లూరు(టౌన్‌): పట్టుదల, క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని రీజనల్‌ జాయింట్‌ డైరక్టర్‌ పరంధామయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక గోమతినగర్‌లోని పావనిగార్డెన్స్‌లో విశ్వసాయి విద్యాసంస్థల ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.

 
  •  ఘనంగా విశ్వసాయి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం
 
నెల్లూరు(టౌన్‌): పట్టుదల, క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని రీజనల్‌ జాయింట్‌ డైరక్టర్‌ పరంధామయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక గోమతినగర్‌లోని పావనిగార్డెన్స్‌లో విశ్వసాయి విద్యాసంస్థల ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరంధామయ్య మాట్లాడుతూ ఉత్తీర్ణత శాతంలో 4వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మొదటి స్థానంలోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రతిభా అవార్డులకు జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు ఎంపిక కాగా, వారిలో ఇద్దరు విశ్వసాయికి చెందినవారన్నారు. ఆర్‌ఐఓ బాబూజాకబ్‌ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కమ్యూనికేషన్‌ సిల్క్స్‌పై ప్రత్యేక శ్రద్థ తీసుకోవాలని సూచించారు. అనంతరం ప్రముఖ కార్డియాలజిస్టు శ్రీనివాసరాజు, ప్రొఫెసర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కళాశాల చైర్మన్, వైస్‌ చైర్మన్‌లు సత్యనారాయణ, కృష్ణమోహన్‌ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం 80 మంది విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో సీట్లు సాధించడమే కాకుండా పలు ప్రవేశ పరీక్షల ద్వారా ఎంతోమంది స్కాలర్‌షిప్‌లకు ఎంపికైనట్లు చెప్పారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్‌ జితేంద్ర, శివశంకర్, శ్రీరామ్‌రెడ్డి, సుబ్బరాయుడు, జనరల్‌ మేనేజర్‌ రాజేష్‌కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement