ప్రేమ వేధింపులు తాళలేక.. | College girl attempt to suicide not to bare of love harassments | Sakshi
Sakshi News home page

ప్రేమ వేధింపులు తాళలేక..

Jul 14 2016 11:04 PM | Updated on Sep 2 2018 5:06 PM

ప్రేమ పేరిట ఓ యువకుడి వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన ఆదిలాబాద్ మండలం చాందా-టి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.

ఆదిలాబాద్ రూరల్: ప్రేమ పేరిట ఓ యువకుడి వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన ఆదిలాబాద్ మండలం చాందా-టి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చాందా-టి గ్రామానికి చెందిన విద్యార్థిని(17) ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గ్రామం నుంచి కళాశాలకు నిత్యం బస్సులో రాకపోకలు సాగిస్తోంది. ఈ క్రమంలో జైనథ్ మండలం లేఖర్‌వాడకు చెందిన ఎం.చంద్రశేఖర్(24) పనీపాట లేకుండా తిరుగుతుంటాడు.

తనను ప్రేమించాలంటూ ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. వేధింపులతో మనస్తాపం చెందిన ఆమె గురువారం వేకువజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. శరీరం 80 శాతం కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆదిలాబాద్ రూరల్ ప్రొబేషనరీ ఎస్సై సుబ్బారావు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement