ఫాంహౌస్‌లో కేసీఆర్ | cm kcr reaches his form house | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌లో కేసీఆర్

Dec 12 2015 10:30 PM | Updated on Aug 14 2018 10:54 AM

ఫాంహౌస్‌లో కేసీఆర్ - Sakshi

ఫాంహౌస్‌లో కేసీఆర్

ఫాంహౌస్‌కు చేరుకున్న కసీఎం కేసీఆర్.. చండీయాగం పనులను పరిశీలించారు. పది నిమిషాల పాటు చండీయాగం నిర్వహణ స్థలంలో తిరిగారు.

జగదేవ్‌పూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం రాత్రి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో గల తన వ్యవసాయక్షేత్రానికి చేరుకున్నారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో కాన్వాయ్ ద్వారా ఫాంహౌస్‌కు చేరుకున్న ఆయన.. వస్తూనే చండీయాగం పనులను పరిశీలించారు. పది నిమిషాల పాటు చండీయాగం నిర్వహణ స్థలంలో తిరిగారు. 'యాగం పనులు ఎంత వరకు వచ్చాయ్' అంటూ ఆరా తీశారు.

బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అయుత చండీయాగం పనుల వివరాలను సీఎంకు వివరించారు. పనులను వేగంగా చేయాలని నిర్వహకులకు సీఎం సూచించారు. ఆదివారం సాయంత్రం వరకు వ్యవసాయక్షేత్రంలోనే ఉండనున్నట్లు సమాచారం. సీఎం ఫాంహౌస్‌కు వస్తున్నారని సమాచారం ఉండడంతో జిల్లా ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో ఫాంహౌస్ వద్ద పోలీస్‌బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకు ముందు శంగేరీ వేద పండితులు శశాంక్‌శర్మ, గోపికష్ణశర్మలు చండీయాగం పనులను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement