ఆకట్టుకున్న శాస్త్రీయ సంగీతం | Classical singing is super | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న శాస్త్రీయ సంగీతం

Dec 4 2016 9:09 PM | Updated on Sep 4 2017 9:54 PM

ఆకట్టుకున్న శాస్త్రీయ సంగీతం

ఆకట్టుకున్న శాస్త్రీయ సంగీతం

గాయత్రీ మహిళా çసంగీత సన్మండలి ఆధ్వర్యంలో బ్రాడీపేట సిద్ధేశ్వరీ పీఠపాలిట ఓంకార క్షేత్రంలో ఆదివారం శాస్త్రీయ..

పాత గుంటూరు: గాయత్రీ మహిళా çసంగీత సన్మండలి ఆధ్వర్యంలో బ్రాడీపేట సిద్ధేశ్వరీ పీఠపాలిట ఓంకార క్షేత్రంలో ఆదివారం శాస్త్రీయ సంగీత కచేరి నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్‌ ఎ.వి.దక్షిణామూర్తి జ్యోతి ప్రజ్వలన చేయగా డాక్టర్‌ బండ్లమూడి సూర్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నూజివీడుకు చెందిన బి.విద్యాసాగర్‌ గాత్రం చేయగా విజయవాడ హేమాద్రి చంద్రకాంత్‌ వయోలిన్, గుంటూరుకు చెందిన బి.సురేష్‌బాబు మృదంగంతో నిర్వహించిన సంగీత కార్యక్రమం ఆహూతులను ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని కె.ఆర్‌.ఎస్‌.ఆర్‌.కృష్ణ నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement