ఊట్కూర్ : మండలంలోని జీర్ణహల్లి, ఊట్కూర్, పెద్దపొర్ల శివారు పొలాల్లో చిరుతపులి సంచరిస్తున్నదని సమాచారం తెలుసుకొని గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఊ ట్కూర్, జీర్ణహల్లి, పెద్దపొర్ల గ్రామాలలోని రైతులను, గ్రామస్తులను కలిసి వివరాలను సేకరించారు.
చిరుత సంచారంపై విచారణ
Sep 3 2016 12:08 AM | Updated on Oct 4 2018 6:03 PM
ఊట్కూర్ : మండలంలోని జీర్ణహల్లి, ఊట్కూర్, పెద్దపొర్ల శివారు పొలాల్లో చిరుతపులి సంచరిస్తున్నదని సమాచారం తెలుసుకొని గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఊ ట్కూర్, జీర్ణహల్లి, పెద్దపొర్ల గ్రామాలలోని రైతులను, గ్రామస్తులను కలిసి వివరాలను సేకరించారు. ఊట్కూర్‌లోని దంతన్‌పల్లి రైతులు నక్క తాయప్ప, బాలప్ప, వెంకటప్ప తదితర రైతులను కలిసి వివరాలు సేకరించారు. రైతులు భయపడి చిరుతను చంపేందుకు పొలాలకు విద్యుత్ ప్రసారం, విషగుళికలు, చిరుతపై దాడులు చేయరాదని అటవీశాఖ అధికారులు హఫీజ్, విజయ్ కుమార్ తెలిపారు. చిరుత కనపడితే సమాచారం ఇవ్వాలని, ఉన్నతాధికారులకు తెలిపి చిరుతను పట్టుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్, ఎం. లక్ష్మారెడ్డి, రాజ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement