చిన్న వయస్సులో పెద్ద కష్టం.. | child health problem | Sakshi
Sakshi News home page

చిన్న వయస్సులో పెద్ద కష్టం..

Dec 10 2016 11:36 PM | Updated on Oct 2 2018 5:51 PM

పేద కుటుంబంలో పుట్టిన దివ్యభారతిని వారి స్థితికి మించి, వారు వైద్యం చేయించలేని అనారోగ్యం పీడిస్తోంది. ఆమెను ఆదుకోవాలని ఆమె తల్లిదండ్రులు దాతలను కోరుతున్నారు. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి శనివారపు శ్రీనివాస్, బేబి లావణ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఎనిమిదేళ్ల పెద్ద కుమార్తె దివ్యభారతి లివర్‌ సంబంధ సమస్యతో బాధప డుతోంది. వయస్సు పెరిగే కొద్ది లివర్‌ పెరగడం

  • ఆదుకోవాలని దాతలకు తల్లిదండ్రుల విజ్ఞప్తి
  • కె.గంగవరం :
    పేద కుటుంబంలో పుట్టిన దివ్యభారతిని వారి స్థితికి మించి, వారు వైద్యం చేయించలేని అనారోగ్యం పీడిస్తోంది.  ఆమెను ఆదుకోవాలని ఆమె తల్లిదండ్రులు దాతలను కోరుతున్నారు. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి శనివారపు శ్రీనివాస్, బేబి లావణ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఎనిమిదేళ్ల పెద్ద కుమార్తె దివ్యభారతి లివర్‌ సంబంధ సమస్యతో బాధప డుతోంది. వయస్సు పెరిగే కొద్ది లివర్‌ పెరగడం వల్ల ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తల్లిదండ్రులు దాచుకున్న సొమ్ముతో సహా అందినచోట అప్పు చేసి కాకినాడ, రాజమండ్రిలో పలు ఆస్పత్రుల్లో రూ.6 లక్షలు ఖర్చుచేసి వైద్యం అందించారు. అయినా నయమవకపోవడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా లివర్‌మార్పిడి చేయాలని దీని కి రూ.18 లక్షలు ఖర్చు అవుతాయని సూచించనట్లు శ్రీనివాస్‌ తెలి పారు. దీంతో పాటు ప రీక్షలు, మందుల ఖర్చుల కు మరో పెద్దమొత్తం అవసరం అవుతాయని వైద్యులు సూచించినట్లు శ్రీనివాస్‌ పేర్కొన్నారు.   తమ కుటుంబం ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేయలేమని, దాతలు ఆదుకుని తమ చిన్నారి ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. దాతలు కె.గంగవరం చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌ 715510100023655కు జమ చేసి దివ్యభారతికి ప్రాణభిక్షపెట్టాలని తల్లిదండ్రుల ప్రాధేయపడుతున్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement