జెమినీ గణేశన్‌గా నటిస్తున్నా.. | Chetan srinu as a gemini ganesan | Sakshi
Sakshi News home page

జెమినీ గణేశన్‌గా నటిస్తున్నా..

Aug 6 2015 9:44 AM | Updated on Sep 3 2017 6:55 AM

జెమినీ గణేశన్‌గా నటిస్తున్నా..

జెమినీ గణేశన్‌గా నటిస్తున్నా..

తమిళంలో హీరో జెమినీగణేశన్ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆయన పాత్రలో నటిస్తున్నానని, అదో అరుదైన అనుభూతి అని యువహీరో చేతన్ శ్రీను తెలిపారు.

యువ హీరో చేతన్ శ్రీను

రాజమండ్రి: తమిళంలో హీరో జెమినీగణేశన్ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆయన పాత్రలో నటిస్తున్నానని, అదో అరుదైన అనుభూతి అని యువహీరో చేతన్ శ్రీను తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగువాడిగా, తెలుగు గడ్డపై పేరు తెచ్చుకోవాలన్నది తన తాపత్రయమని, ఇకపై ఏడాదికి నాలుగు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమా చేయాలనుకుంటున్నాని అన్నారు.
 
ఇటీవల విడుదలైన ‘మంత్ర-2’లో తన పాత్రకు జిల్లా అంతటా మంచి స్పందన వచ్చిందన్నారు. బాపు దర్శకత్వం వహించిన ‘పెళ్ళిపుస్తకం’ వంటి కుటుంబ కథాచిత్రాలలో చేయాలని కోరుకుంటున్నానన్నారు. తాను నటించిన ‘రాజుగారి గది’ త్వరలో విడుదలవుతుందన్నారు. అయిదుగురు హీరోయిన్లు నటించే ఒక భారీ తెలుగు సినిమాలో హీరోగా నటించబోతున్నానని, వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. తమిళంలో కూడా భారీ సినిమా చేస్తున్నానన్నారు. తెలుగు ప్రేక్షకులు ప్రోత్సహించాలని కోరారు. విలేకరుల సమావేశంలో నిర్మాతలు ఇడుపుగంటి శేషగిరి, గార్లపాటి సూర్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement