breaking news
Chetan srinu
-
'జెంటిల్ మేన్ 2' ప్రారంభం
ముప్పైఏళ్ల క్రితం అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో కేటీ కుంజుమోన్ నిర్మించిన ‘జెంటిల్ మేన్’ సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత నిర్మించిన ‘ప్రేమ దేశం’, ‘రక్షకుడు’ వంటివి కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. చాలా గ్యాప్ తర్వాత కుంజుమోన్ ‘జెంటిల్ మేన్ 2’కి శ్రీకారం చుట్టారు. చేతన్ శ్రీను హీరోగా గోకుల్కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో తమిళనాడు సమాచార, ప్రసార, మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖా మంత్రి ఎల్. మురుగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతదర్శకుడు. ఈ వేదికపై కీరవాణిని సన్మానించారు కుంజుమోన్. ‘‘ప్రతి ఒక్కరూ జెంటిల్మేన్ అవ్వాలి అనేది ఈ చిత్రం ప్రధానాంశం’’ అన్నారు కుంజుమోన్. -
జెమినీ గణేశన్గా నటిస్తున్నా..
యువ హీరో చేతన్ శ్రీను రాజమండ్రి: తమిళంలో హీరో జెమినీగణేశన్ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాలో ఆయన పాత్రలో నటిస్తున్నానని, అదో అరుదైన అనుభూతి అని యువహీరో చేతన్ శ్రీను తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగువాడిగా, తెలుగు గడ్డపై పేరు తెచ్చుకోవాలన్నది తన తాపత్రయమని, ఇకపై ఏడాదికి నాలుగు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమా చేయాలనుకుంటున్నాని అన్నారు. ఇటీవల విడుదలైన ‘మంత్ర-2’లో తన పాత్రకు జిల్లా అంతటా మంచి స్పందన వచ్చిందన్నారు. బాపు దర్శకత్వం వహించిన ‘పెళ్ళిపుస్తకం’ వంటి కుటుంబ కథాచిత్రాలలో చేయాలని కోరుకుంటున్నానన్నారు. తాను నటించిన ‘రాజుగారి గది’ త్వరలో విడుదలవుతుందన్నారు. అయిదుగురు హీరోయిన్లు నటించే ఒక భారీ తెలుగు సినిమాలో హీరోగా నటించబోతున్నానని, వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. తమిళంలో కూడా భారీ సినిమా చేస్తున్నానన్నారు. తెలుగు ప్రేక్షకులు ప్రోత్సహించాలని కోరారు. విలేకరుల సమావేశంలో నిర్మాతలు ఇడుపుగంటి శేషగిరి, గార్లపాటి సూర్యనారాయణ పాల్గొన్నారు.