కోదండరాం ఎటువైపో తేల్చుకోవాలి.. | cheruku sudhakar asked kodandaram for which side you works | Sakshi
Sakshi News home page

కోదండరాం ఎటువైపో తేల్చుకోవాలి..

Nov 29 2016 3:00 AM | Updated on Sep 4 2017 9:21 PM

కోదండరాం ఎటువైపో తేల్చుకోవాలి..

కోదండరాం ఎటువైపో తేల్చుకోవాలి..

జేఏసీ చైర్మన్ కోదండరాం ఎటువైపో తేల్చు కోవాలని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు.

తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్
సాక్షి, కరీంనగర్: జేఏసీ చైర్మన్ కోదండరాం ఎటువైపో తేల్చు కోవాలని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. సామాజిక తెలంగాణ కోసం ఉద్య మిస్తారా? అధ్యయనాల పేరిట కాలయాపన చేస్తారో? స్పష్టం చేయాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. కరీంనగర్‌లో సోమ వారం ఆయన తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు.

సామాజిక శక్తులను కలుపుకుని ప్రజావ్యతిరేక విధానాలు, హక్కుల కోసం ఉద్యమించాల్సిన జేఏసీ చైర్మన్ కోదండరాం వైఖరి శోచనీయమని అన్నారు. ఈ నెల 24న  దీక్షను భగ్నం చేస్తే ప్రజాస్వామ్య విలువలున్న ప్రత్యామ్నాయ గొంతుకలకు ఆయన మద్దతు కూడా ఇవ్వకపోవడం విచారకరమని అన్నారు. ప్రజలు అష్టకష్టాల్లో ఉంటే చినజీయర్ స్వామి, గవర్నర్ నరసింహిన్‌లకు సీఎం కేసీఆర్ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement