కాపుల కోసం ఎవరో అడిగారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేయడం లేదని ... ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాబట్టి చేస్తున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ స్పష్టం చేశారు.
విజయవాడ : కాపుల కోసం ఎవరో అడిగారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేయడం లేదని ... ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాబట్టి చేస్తున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో చలమలశెట్టి రామాంజనేయ మాట్లాడుతూ... తుని ఘటనలో అరాచకం సృష్టించిన వారిని ప్రభుత్వానికి అప్పజెప్తానని గతంలో మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చెప్పారు.
కానీ ఆయన దీనిపై స్పందించడం లేదని తెలిపారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి అని ముద్రగడ డిమాండ్ చేయడం ఎంత వరకు సమంజసం అని చలమలశెట్టి రామానుజయ ప్రశ్నించారు.