రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్ | Chain Snatching At Hyderabad Champapet | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్

Dec 21 2015 9:39 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్లో చైన్ స్నాచర్లు మరోసారి చెలరేగిపోయారు.

చంపాపేట: హైదరాబాద్లో చైన్ స్నాచర్లు మరోసారి చెలరేగిపోయారు. సోమవారం ఉదయం చంపాపేట సామ గంగారెడ్డి కాలనీలో మహిళ మెడలో బంగారు గొలుసును తెంపుకుపోయారు. మణెమ్మ అనే గృహిణి గుడికి వెళుతున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని సుమారు రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరో ఘటన ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలో ఓ దుండగుడు మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించుకుపోయాడు. రామిడి కనకలక్ష్మి అనే మహిళ కిరాణ షాపును తెరిచి శుభ్రం చేసుకుంటుంది. అదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ కావాలని అడిగాడు. అతడికి సిగరెట్ ఇచ్చిన అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్లుతున్న సమయంలో దుండగుడు ఆమె వెనుక నుంచి పుస్తెలతాడును తెంపుకుపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement