స్వైపింగ్‌ మిషన్లతో క్యాష్‌లెస్‌ ట్రాన్సాక్షన్స్‌ | Sakshi
Sakshi News home page

స్వైపింగ్‌ మిషన్లతో క్యాష్‌లెస్‌ ట్రాన్సాక్షన్స్‌

Published Thu, Nov 24 2016 1:19 AM

స్వైపింగ్‌ మిషన్లతో క్యాష్‌లెస్‌ ట్రాన్సాక్షన్స్‌ - Sakshi

  • రేషన్‌ డీలర్లు కరెంట్‌ అకౌంట్లు ప్రారంభించాలి
  • ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు జేసీ ఆదేశం
  • నెల్లూరు(పొగతోట): కూరగాయల మార్కెట్లు, పచారిషాపులు, షాపింగ్‌మాల్స్, పెట్రోలు బంకులు, మెడికల్‌ షాపులు తదితర వాటిల్లో స్వైపింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసి క్యాష్‌లెస్‌ ట్రాన్సాక్షన్స్‌ నిర్వహించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ ఏ. మహమ్మద్‌ఇంతియాజ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాలులో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు, వ్యాపారులు, చౌకదుకాణాల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. క్యాష్‌లెస్‌ ట్రాన్సాక్షన్స్‌పై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులుపడకుండా బ్యాంకు అకౌంట్లు, జనధన్‌ అకౌంట్లు ఉన్నా వారందరికి రూపే కార్డులు పంపిణి చేయాలన్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బ్యాంకు సేవలకు ఇబ్బందులు పడకుండా చౌకదుకాణాల డీలర్లను బ్యాంకింగ్‌ కరాస్పాండెంట్లుగా నియమించడం జరిగిందన్నారు. డీలర్లందరు బ్యాంకు కరెంట్‌ అకౌంట్లు ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో 430 ఏటీఎంలు ఉన్నాయన్నారు. వాటిలో 200ఏటీఎంలను కొత్త రూ.2000లు, రూ,500ల నోట్లు  తీసుకునేలా సిద్దం చేశామన్నారు. కూరగాయల మార్కెట్లలో ప్రజలు ఇబ్బందులు పడకుండా మిని ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి చౌకదుకాణాల్లో నగదు లేకుండా రేషన్‌ పంపిణి చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 418 బ్యాంకులు ఉన్నాయన్నారు.  ప్రతి నిత్యం రూ.220 కోట్లు అ ప్రస్తుతం రూ.80 కోట్లు అందుబాటులో ఉంటున్నాయన్నారు. 
    పరిశ్రమలకు అనుకులమైన భూములను గుర్తించండి.
    పరిశ్రమలకు అనుకులంగా ఉండే భూములను గుర్తించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఏ.మహమ్మద్‌ఇంతియాజ్‌ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుకు మౌలికసదుపాయాలు ఉండే భూములను గుర్తించాలని సూచించారు.
     

Advertisement
 

తప్పక చదవండి

Advertisement