గోదావరి నది నుంచి ఇసుకను తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై శనివారం ఉదయం రెవెన్యూ, పోలీస్ సిబ్బంది దాడులు నిర్వహించారు. మండలంలోని తాళ్లపాలెం, శెట్టిపేట గ్రామాల్లో పడవల ద్వారా ఇసుకను రవాణా చేసి అధిక ధరలకు విక్రయించడంతో పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇసుక విక్రయదారులపై అధికారుల దాడి
Sep 10 2017 12:08 AM | Updated on Sep 12 2017 2:22 AM
అధిక ధరలు వసూలుపై తొమ్మిది మందిపై కేసులు
నాలుగు లారీలు, ఐదు పడవలు సీజ్
నిడదవోలు రూరల్ : గోదావరి నది నుంచి ఇసుకను తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై శనివారం ఉదయం రెవెన్యూ, పోలీస్ సిబ్బంది దాడులు నిర్వహించారు. మండలంలోని తాళ్లపాలెం, శెట్టిపేట గ్రామాల్లో పడవల ద్వారా ఇసుకను రవాణా చేసి అధిక ధరలకు విక్రయించడంతో పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, సీఐ ఎం.బాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేసి ఐదు పడవలు, నాలుగు లారీలు సీజ్ చేశారు. పడవల నుంచి లారీలకు ఇసుకను విక్రయిస్తున్న 9 మందిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై జి.సతీష్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్ ఇసుకను రూ.800కు విక్రయించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేయగా పడవ నిర్వాహకులు మాత్రం యూనిట్ ఇసుకను రూ.1500 పైనే వసూలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. అధిక ధరలకు ఇసుక విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Advertisement
Advertisement