నయవంచకుడిపై కేసు | case file on decoit | Sakshi
Sakshi News home page

నయవంచకుడిపై కేసు

Aug 17 2016 11:33 PM | Updated on Sep 4 2017 9:41 AM

ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన నయవంచకుడిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు అనంతపురం వన్‌టౌన్‌ సీఐ రాఘవన్‌ తెలిపారు.

అనంతపురం సెంట్రల్‌ : ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన నయవంచకుడిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు అనంతపురం వన్‌టౌన్‌ సీఐ రాఘవన్‌ తెలిపారు. స్థానిక మున్నానగర్‌కు చెందిన యువతిని అదే కాలనీకి చెందిన షేక్‌ హాజీపీరా అలియాస్‌ పీరా ప్రేమ పేరుతో లోబరచుకున్నట్లు బాధితురాలు తమకు ఫిర్యాదు చేసిందన్నారు.

ఆ తరువాత పెళ్లి ప్రస్తావన తెస్తే అడ్డం తిరగడంతో తమను ఆశ్రయించినట్లు వివరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు జడ్జి ఆదేశించార ని సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement