స్థిరపడే త’రుణం’ ఎవరికో..! | carporation loans | Sakshi
Sakshi News home page

స్థిరపడే త’రుణం’ ఎవరికో..!

Nov 5 2016 11:02 PM | Updated on Aug 13 2018 8:03 PM

స్థిరపడే త’రుణం’ ఎవరికో..! - Sakshi

స్థిరపడే త’రుణం’ ఎవరికో..!

భీమవరం పట్టణ యువత జీవితంలో స్థిరపడే తరుణం ఎప్పుడోనని ఎదురుచూస్తున్నారు. 201617 ఆర్థిక సంవత్సరానికి స్వయం ఉపాధి పథకం రుణాల కోసం వివిధ కార్పొరేషన్లకు దరఖాస్తులు ఆహ్వానించగా వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తులు అందజేశారు. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్‌ కార్పొరేషన్లకు దరఖాస్తులు చేసుకున్నారు.

కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తుల గడువు పూర్తి
పట్టణంలో 2,356 దరఖాస్తులు
కేటాయించిన యూనిట్లు 180
2,176 మందికి మొండిచేయి
భీమవరం టౌన్‌: భీమవరం పట్టణ యువత జీవితంలో స్థిరపడే తరుణం ఎప్పుడోనని ఎదురుచూస్తున్నారు. 201617 ఆర్థిక సంవత్సరానికి స్వయం ఉపాధి పథకం రుణాల కోసం వివిధ కార్పొరేషన్లకు దరఖాస్తులు ఆహ్వానించగా వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తులు అందజేశారు. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్‌ కార్పొరేషన్లకు దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తంగా 2,356 మంది దరఖాస్తు చేసుకున్నారు. రుణం ఇచ్చేందుకు సుముఖత పొందుతూ బ్యాంకుల నుంచి అంగీకారపత్రాలు తీసుకుని అధికారులు దరఖాస్తులకు జత చేసి ఆన్‌లైన్‌లో పంపించారు. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడినా ప్రభుత్వం సబ్సిడీ భారం పడకుండా తన లక్ష్యాన్ని కుదించుకుంది. దీంతో 180 యూనిట్లు మాత్రమే లక్ష్యంగా కేటాయింపులు చేసింది. దీంతో 2,176 మంది యువతకు ప్రభుత్వం మొండి చేయిచూపింది. కాపు కార్పొరేషన్‌ రుణాలకు అత్యధికంగా 1,604 మంది దరఖాస్తు చేసుకోగా 75 యూనిట్లతో సరిపెట్టారు. ఈనెల మూడో వారంలో ఎంపికైన అభ్యర్థులకు మునిసిపల్‌ చైర్మన్‌ ఆధ్వర్యంలో కమిటీ, బ్యాంకర్ల సమక్షంలో ఇంటర్యూ ‍్వలు నిర్వహించనున్నారు. పట్టణంలో వివిధ కార్పొరేషన్లకు ఉపాధి రుణాల కోసం చేసుకున్న దరఖాస్తులు, కేటాయింపులు ఇలా ఉన్నాయి.  దరఖాస్తులు యూనిట్ల కేటాయింపు విలువ (రూ.లక్షల్లో)
కాపు 1,604 75 150
బీసీ 424 19 38
ఎస్సీ 155 63 126
ఎస్టీ 25 03 06
ముస్లిం 124 14 28
క్రిస్టియన్‌ 24 06 12
మొత్తం 2,356 180 360

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement