మంటల్లో చిక్కుకొని కారు దగ్ధం | car Trapped in fire | Sakshi
Sakshi News home page

మంటల్లో చిక్కుకొని కారు దగ్ధం

Aug 17 2016 6:25 PM | Updated on Sep 4 2017 9:41 AM

వేగంగా వెళ్తున్న కారులో మంటలు వ్యాపించి క్షణాల్లో కారు తగలపడిపోయిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద బుధవారం వెలుగుచూసింది.

వేగంగా వెళ్తున్న కారులో మంటలు వ్యాపించి క్షణాల్లో కారు తగలపడిపోయిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద బుధవారం వెలుగుచూసింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చే లోపే కారు పూర్తిగా కాలి బూడిదైంది. కారులో మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు అందులో నుంచి బయటపడ్డారు. వంట కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ల సాయంతో కారును నడుపుతుంటంతోటే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మరో రెండు గ్యాస్ సిలిండర్లు ఉండటంతోటే మంటల తీవ్రత అధికంగా ఉందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement