ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను పని సర్దుబాటు పేరుతో బదిలీలు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాఫ్టో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు డిమాండ్ చేశారు.
పని సర్దుబాటు ఉత్తర్వులను రద్దు చేయాలి
Jan 7 2017 12:30 AM | Updated on Sep 5 2017 12:35 AM
ప్యాఫ్టో రాష్ట ప్రధాన కార్యదర్శి డిమాండ్
కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను పని సర్దుబాటు పేరుతో బదిలీలు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాఫ్టో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం పని సర్దుబాటు ఉత్తర్వులకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభంలో చేయాల్సిన పనిని మధ్యలో చేపడితే ఎలా అని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవరించాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం తగదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా కన్వీనర్ సురేష్ కూమార్, ఏపీటీఎఫ్(257) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగాప్రసాద్, యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అద్యక్షుడు ఎన్.నరసింహూలు, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి తిమ్మన్న, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.రామశేషయ్య, డీటీఎఫ్ నాయకుడు కృష్ణ, ఏపీటీఎఫ్ నాయకులు ఇస్మాయిల్, కమలాకరరావు, ఆర్‌యూపీపీ నాయకులు నాగేంద్రుడు, రఘు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement