సిరొంచాకు బస్సు ట్రయల్‌ రన్‌ | bus services to srioncha | Sakshi
Sakshi News home page

సిరొంచాకు బస్సు ట్రయల్‌ రన్‌

Aug 24 2016 10:14 PM | Updated on Sep 4 2017 10:43 AM

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచాకు ఆర్టీసీ బస్సు ట్రయల్‌ రన్‌ను భూపాలపల్లి డిపో మేనేజర్‌ రఘు ప్రారంభించారు. బుధవారం సాయంత్రం కాళేశ్వరం వద్ద అంతర్రాష్ట్ర వంతెన మీదుగా సిరొంచాకు భూపాలపల్లి బస్సును నడిపారు. సిరొంచా నగర పంచాయతీ మేయర్‌ రాజీవ్‌ పెద్దపల్లి ఆర్టీసీ అధికారులకు ఘనంగా స్వాగతం పలికారు.

  • వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు 
  •  కాళేశ్వరం : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచాకు ఆర్టీసీ బస్సు ట్రయల్‌ రన్‌ను భూపాలపల్లి డిపో మేనేజర్‌ రఘు ప్రారంభించారు. బుధవారం సాయంత్రం కాళేశ్వరం వద్ద అంతర్రాష్ట్ర వంతెన మీదుగా సిరొంచాకు భూపాలపల్లి బస్సును నడిపారు. సిరొంచా నగర పంచాయతీ మేయర్‌ రాజీవ్‌ పెద్దపల్లి ఆర్టీసీ అధికారులకు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణతో సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆనందం వ్యక్తంచేశారు. అనంతరం డీఎం రఘు మాట్లాడుతూ.. అధికారుల ఆదేశాలతో హైదరాబాద్‌ నుంచి సిరొంచాకు నడిపేందుకు ట్రయల్‌రన్‌ నిర్వహించామన్నారు. ఆయన వెంట ట్రాఫిక్‌ అధికారి సరస్వతి, సూపరింటెండెంట్‌ శ్రీహరి, టీఎంయూ నాయకులు తిరుపతి, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. 
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement