బీపీఎస్ (భవనాల క్రమబద్ధీకరణ పథకం)కు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. ఈ పథకం గడువు మార్చి నెలాఖరుకు ముగియనుంది.
బీపీఎస్ గడువు పెంపు
Mar 29 2017 11:07 PM | Updated on Sep 5 2017 7:25 AM
కర్నూలు (టౌన్): బీపీఎస్ (భవనాల క్రమబద్ధీకరణ పథకం)కు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. ఈ పథకం గడువు మార్చి నెలాఖరుకు ముగియనుంది. అయితే అనేక మున్సిపాల్టీల నుంచి అభ్యర్థనలు రావడంతో ఏప్రిల్ 30 వరకు గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా భవనాలు నిర్మించుకున్న భవన యజమానులు బీపీఎస్ కింద తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement