విద్యార్థి ఉసురు తీసిన అలలు | boy dies of waves effect | Sakshi
Sakshi News home page

విద్యార్థి ఉసురు తీసిన అలలు

Jun 27 2017 10:37 PM | Updated on Sep 5 2017 2:36 PM

సముద్రపు అలలు ఓ విద్యార్థి ఉసురు తీశాయి. ధర్మవరం పట్టణంలోని దుర్గానగర్‌కు చెందిన ప్రసాద్, ఇందిరమ్మ దంపతుల కుమారుడు రాజశేఖర్‌ (19) చెన్నైలో బీటెక్‌ చదువుతున్నాడు.

ధర్మవరం అర్బన్ : సముద్రపు అలలు ఓ విద్యార్థి ఉసురు తీశాయి. ధర్మవరం పట్టణంలోని దుర్గానగర్‌కు చెందిన ప్రసాద్, ఇందిరమ్మ దంపతుల కుమారుడు రాజశేఖర్‌ (19) చెన్నైలో బీటెక్‌ చదువుతున్నాడు. ఈ నెల 25న తన స్నేహితులతో కలసి అక్కడి బీచ్‌కు వెళ్లాడు. అలల తాకిడికి రాజశేఖర్‌ చిక్కుకుని మృతి చెందాడు. మృతదేహాన్ని మంగళవారం ఉదయం ధర్మవరం తీసుకొచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. మృతుడి కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ వార్డు ఇన్‌చార్జ్‌ బాలిరెడ్డి, నాయకులు బోయ శ్రీనివాసులు, సుబ్రమణ్యం, వాసు తదితరులు పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement