కంటైనర్ ఢీకొనడంతో చిన్నారి మృతి చెందిన ఘటన మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
కంటైనర్ ఢీకొని చిన్నారి మృతి
Jan 26 2017 12:28 AM | Updated on Jul 12 2019 3:02 PM
మంత్రాలయం రూరల్: కంటైనర్ ఢీకొనడంతో చిన్నారి మృతి చెందిన ఘటన మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ రాజు, లక్ష్మి దంపతులు తమ ఏకైక కుమారుడు వినోద్‌ను తీసుకుని కర్ణాటక రాష్ట్రంలోని రాయాచూర్ జిల్లా మాల్కాపురం గ్రామానికి ఉపాధి నిమిత్తం వెళ్లారు. పనులు ముగించుకుని మంత్రాలయం నుంచి చిలకలడోణ గ్రామానికి ఆటోలో బయలుదేరారు.
గ్రామం చేరుకొని ఎడమ వైపు నుంచి రోడ్డు దాటుతుండగా చైన్నె నుంచి పుణె వెళ్తుతున్న కంటైనర్(ఎంహెచ్12ఎంవీ1639) చిన్నారి వినోద్‌ను ఢీకొట్టింది. గాయాలపాలైన వినోద్‌ను చికిత్స నిమిత్తం ప్రయివేటు వాహనంలో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఏకైక కుమారుడు మృతి చెందడంతో తల్లితండ్రుల రోదన పలువురిని కంటతడి పెట్టించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement