ఎముకలు పూడ్చి పెట్టిన పోలీసులు | Bones was buried police | Sakshi
Sakshi News home page

ఎముకలు పూడ్చి పెట్టిన పోలీసులు

May 7 2016 2:29 AM | Updated on Aug 21 2018 5:54 PM

ఎముకలు పూడ్చి  పెట్టిన పోలీసులు - Sakshi

ఎముకలు పూడ్చి పెట్టిన పోలీసులు

అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఎముకలను శుక్రవారం పట్టణానికి దూరంగా గొయ్యి తవ్వి పూడ్చి వేశారు.

వికారాబాద్ రూరల్: అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఎముకలను శుక్రవారం పట్టణానికి దూరంగా గొయ్యి తవ్వి పూడ్చి వేశారు. కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ఎముకల వ్యాపారం జరుగుతున్న దృష్ట్యా పోలీసులు గట్టినిఘా ఏర్పాటు చేశారు. మూడు రోజుల క్రితం ఎముకలు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడి వద్ద ఎముకలను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం ఆ లారీ లోని ఎముకలను అనంతగిరిపల్లి దాటిన తరువాత బహిరంగ ప్రదేశంలో జేసీబీ సాయంతో గుంత తీసి అందులో పూడ్చివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement