బీజేవైఎం బైక్‌ ర్యాలీ | bjp leaders bike rally in nellore district | Sakshi
Sakshi News home page

బీజేవైఎం బైక్‌ ర్యాలీ

Jun 13 2016 12:10 PM | Updated on Mar 28 2019 8:37 PM

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వికాస్‌ పర్వ్‌లో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

నెల్లూరు: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వికాస్‌ పర్వ్‌లో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మినీబైపాస్‌లోని ఆ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి మాట్లాడారు. నరేంద్రమోడీ రెండేళ్ల పాలనలో దేశంలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. వికాస్‌ పర్వ్‌ పేరుతో దేశంలో జరిగిన అభివృద్ధి, జరపాల్సిన అభివృద్ధిపై ప్రజలకు తెలియచేసేందుకు రాష్ట్రాల్లో సభలు నిర్వహిస్తున్నారన్నారు. ఈక్రమంలో ఈనెల 16వ తేదీన నగరంలోని నర్తకి సెంటర్‌లో బహిరంగా సభ నిర్వహిస్తామన్నారు. సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ ముఖ్య అతి«థిగా హాజరు కానున్నట్లు చెప్పారు.

జిల్లా కార్యాలయం నుంచి బయలు దేరి నగరంలోని ఆత్మకూరు బస్టాండ్‌ కనకమహాల్‌ సెంటర్, నర్తకి సెంటర్, ఏసీ సెంటర్, ట్రంకురోడ్డు మీదుగా వీఆర్సీ, మద్రాసుబస్టాండ్, ఆర్టీసీ సెంటర్‌ వరకు కొనసాగింది.  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మొగరాల సురేష్, ఉపాధ్యక్షుడు గుంజి కృష్ణ, ప్రధాన కార్యదర్శి దాసరి ప్రసాద్, నాయకులు ఉదయ్, మధుసూదన్, మల్లి, సతీష్, రవి, శ్రీను, పెంచలయ్య  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement