'కమ్యూనిజం లో నిజం లేదు' | Bharat Mata ki jai’ has no religious connotation, it’s only a salutation to people: Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

'కమ్యూనిజం లో నిజం లేదు'

Mar 26 2016 1:20 PM | Updated on Sep 3 2017 8:38 PM

'కమ్యూనిజం లో నిజం లేదు'

'కమ్యూనిజం లో నిజం లేదు'

భారత్ మాతాకీ జై అనేది ఓ మత నినాదం కాదని.. దానర్థం ప్రజలని.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

భారత్ మాతాకీ జై అనేది ఓ మత నినాదం కాదని.. దానర్థం ప్రజలని.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతి ఒక్కరూ భారత్ మాతాకీ జై అనాలని సూచించారు. విజయవాడ గుణదల ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాలులో శనివారం ‘అమరవీరులకు అవమానం... జాతీయ సమైక్యత’ అనే అంశంపై జరిగిన సమావేశంలో వెంకయ్య పాల్గొని మాట్లాడారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య భావ దరిద్రుడన్నారు.

విద్యాలయాల్లోకి విచ్చినకర శక్తులు చొరబడి విద్య కాకుండా వామపక్ష భావజాలాన్ని రుద్దుతున్నాయన్నారు. కమ్యూనిజంలో నిజం లేదని విమర్శించారు. విదేశీ భావజాలాన్ని దేశంపై రుద్దుతోందన్నారు. కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికన దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఏబీవీపీ, బీజేపీ నాయకులు సిద్ధాంతపరంగా అంశాలపై చర్చించి ప్రజలకు వాస్తవాలు తెలిసే దిశగా కృషి చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement