కృష్ణా పుష్కరాల కోసం జిల్లాకు వచ్చే భక్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఘాట్లలో మాత్రమే స్నానాలు చేయాలని ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి సూచించారు.
ఘాట్లలో మాత్రమే స్నానాలు చేయాలి : ఎస్పీ
Aug 22 2016 12:10 AM | Updated on Sep 4 2017 10:16 AM
నల్లగొండ క్రైం : కృష్ణా పుష్కరాల కోసం జిల్లాకు వచ్చే భక్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఘాట్లలో మాత్రమే స్నానాలు చేయాలని ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి సూచించారు. ఘాట్లకు దూరంగా వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని పేర్కొన్నారు. ఆదివారం కాచరాజుపల్లి ఘాట్ సమీపంలో ఘాట్ లేని చోట స్నానానికి వెళ్లి హైదరాబాద్‌కు చెందిన హార్దిక్ (12) మృత్యువాత పడిన ఘటనపై ఆయన ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement


