బాలయ్యా...! మజాకా...!! | Balayya mazaka | Sakshi
Sakshi News home page

బాలయ్యా...! మజాకా...!!

Nov 1 2015 4:05 AM | Updated on Mar 29 2019 9:07 PM

బాలయ్యా...! మజాకా...!! - Sakshi

బాలయ్యా...! మజాకా...!!

ముఖ్యమంత్రి వియ్యంకుడు.. పేరు ప్రఖ్యాతులున్న సినీ నటుడు. ఇన్ని అర్హతలున్న బాలయ్య ఎమ్మెల్యే మాత్రమే. అయితేనేం, మంత్రి సైతం వంగివంగి దండాలు

ముఖ్యమంత్రి వియ్యంకుడు.. పేరు ప్రఖ్యాతులున్న సినీ నటుడు. ఇన్ని అర్హతలున్న బాలయ్య ఎమ్మెల్యే మాత్రమే. అయితేనేం, మంత్రి సైతం వంగివంగి దండాలు చేయక తప్పుతుందా..! మిత్రపక్ష హోదాలో రాష్ట్ర మంత్రివర్గంలో పదవి అనుభవిస్తున్న బీజేపీ నేత ఒకరు సచివాలయంలో తన చాంబర్‌కు వచ్చిన బాలకృష్ణకు మంత్రి హోదాను కూడా మరిచి అతిథి మర్యాదలు చేశారు. నాలుగు రోజుల కిందట నియోజకవర్గంలోని ఒకపని నిమిత్తం బాలకృష్ణ మంత్రి చాంబర్‌కు వచ్చారు. అధికారులతో చర్చలు పూర్తయ్యాక ఆ మంత్రి, ఎమ్మెల్యే బాలకృష్ణ ఇద్దరూ విలేకరుల సమావేశం నిర్వహించారు.

అధికారులతో సమావేశం జరిగినంత సేపు మంత్రి ఆయన అధికారిక కుర్చీలో, బాలకృష్ణ అతిధి సీటులోనే కూర్చున్నారు. విలేకరుల సమావేశం సమయం వచ్చేసరికి సీఎం వియ్యంకుడు తన పక్కన సాధారణ కుర్చీలో కూర్చొని ప్రజలకు కనిపించడం ఏమిటని మంత్రి అనుకున్నారో..! ఏమో గానీ, అప్పటికప్పుడు మంత్రి తాను కూర్చున్న అధికారిక కుర్చీలోంచి లేచి బాలకృష్ణను తన సీటులో కూర్చోకోవాల్సిందిగా కోరారు. మంత్రి కుర్చీలో కూర్చోవడానికి ఆయన నిరాకరించడంతో ఆ బీజేపీ నేత అప్పటి వరకు మంత్రి హోదాలో తాను ఎంతో దర్పంగా కూర్చున్న కుర్చీనే పక్కకు నెట్టి తాను ఒక సాధారణ కుర్చీనే వేయించుకొని విలేకరులతో మాట్లాడారు. పరపతి ముందు మంత్రి హోదా కూడా దిగదుడుపేనా?

Advertisement
 
Advertisement
Advertisement