బాల సదనాన్ని ఆధునికీకరిస్తాం | Sakshi
Sakshi News home page

బాల సదనాన్ని ఆధునికీకరిస్తాం

Published Fri, Feb 10 2017 11:25 PM

balasadanam collector visit

  • కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌
  • కోటగుమ్మం (రాజమహేంద్రవరం) :
    రాజమహేంద్రవరంలోని బాలసదనంలో నెలకొన్న సమస్యలపై ఈ నెల 4న ‘పెచ్చు’మీరి శీర్షికన వచ్చిన కథనానికి కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ స్పందించారు. దీని గురించి వివరాలు తెలుసుకున్న కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ శుక్రవారం రాజమహేంద్రవరం చేరుకుని నగరపాలక సంస్థ కమిషనర్‌ వి.విజయరామరాజుతో కలిసి బాల సదనాన్ని, ఆ పక్కనే వర్కింగ్‌ ఉమె¯Œ్స వసతి గృహాన్ని పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బాల సదనాన్ని పూర్తిస్థాయిలో ఆధునికీకరిస్తామన్నారు. అంచనాలు తయారు చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలని, లేదా ఇతర నిధులు కేటాయించి మరమ్మతులు చేయించాలన్నారు. సదనంలో 22 మంది విద్యార్థులు ఉన్నారని, ఇంకా అనాథలు చేరేలా భవనాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వర్కింగ్‌ ఉమెన్స్‌ వసతి గృహం కూడా పూర్తిస్థాయిలో ఆధునికీకరించేందుకు నిధులు కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారి (ఇ¯ŒSచార్జి) టి.శారదాదేవి, సీడీపీఓ వరహాలు తదితరులు కలెక్టర్‌ వెంట ఉన్నారు. 
     

Advertisement
Advertisement