గోదావరిలో శివగామి.. | Bahubali scene appeared in godavari pushkaralu | Sakshi
Sakshi News home page

గోదావరిలో శివగామి..

Jul 17 2015 2:47 PM | Updated on Aug 1 2018 5:04 PM

గోదావరిలో శివగామి.. - Sakshi

గోదావరిలో శివగామి..

గోదావరి పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

రాజమండ్రి/కొవ్వూరు : గోదావరి పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పుష్కర ఘాట్‌లకు లక్షలాది మంది భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్లోని పుష్కర ఘాట్ల వద్ద ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ శివగామి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో శివగామి ఒంటి చెత్తో ఓ శిశువును పట్టుకొని వాగులో ఉంటుంది. అలాంటి చిత్రమే రెండు ప్రాంతాల్లో కనిపించింది.

కొవ్వూరులో ఓ తల్లి ఇద్దరు బిడ్డలను, రాజమండ్రిలో ఓ తల్లి తన బిడ్డను గోదావరిలో ఒంటి చెత్తో పైకి ఎత్తిన దృశ్యం కనిపించింది. ఇదిలా ఉండగా, నాలుగో రోజైన శుక్రవారం పుష్కర ఘాట్‌లు భక్తులతో కిటకిటలాడాయి. వేల సంఖ్యలో పిండ ప్రదానం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 30 లక్షల మందికి పైగా భక్తులు స్నానాలు ఆచరించారని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement