బిచ్చగాడని అన్నం పెడ్తె బ్యాగు కొట్టేశాడు | bag robbery by beggur | Sakshi
Sakshi News home page

బిచ్చగాడని అన్నం పెడ్తె బ్యాగు కొట్టేశాడు

Aug 9 2016 10:33 PM | Updated on Sep 4 2017 8:34 AM

బిచ్చగాడికి ఇంట్లోకి పిలిచి అన్నం పెడితే బ్యాగును ఎత్తుకెళ్లిన మెట్టుగూడలో జరిగింది

చిలకలగూడ: ఆకలితో అల్లాడుతుందని దయతో ఇంట్లోకి పిలిచి అన్నం పెడితే  తృప్తిగా భోజనం చేసిన తర్వాత అదే ఇంట్లో బ్యాగును ఎత్తుకెళ్లిన సంఘటన చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడ ఆలుగడ్డబావిలో  మంగళవారం చోటు చేసుకుంది. ఆలుగడ్డబావికి చెందిన బీ.సోలమన్, దీనారాణిలు భార్యాభర్తలు. సోలమన్‌ చిరువ్యాపారి. మంగళవారం ఓ గర్భిణి, వికలాంగుడైన భర్త, ఇద్దరు చిన్నారులతో కలిసి భిక్షాటన చేస్తూ వీధిలోకి వచ్చారు.

చిన్నారులు ఆకలితో ఏడుస్తుండడాన్ని గమనించిన దీనారాణి వారిని ఇంట్లోని అరుగుపై కూర్చోబెట్టి భోజనం పెట్టింది. భోజనం చేసిన తర్వాత వారు క్షణాల్లో అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. కొద్దిసేపటి తర్వాత చూడగా ఇంట్లోని హ్యాండ్‌ బ్యాగ్‌ కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫూటేజీని పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement