ఆయుష్‌ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్‌ | ayush employees transfer councelling | Sakshi
Sakshi News home page

ఆయుష్‌ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్‌

Jun 4 2017 11:13 PM | Updated on Sep 5 2017 12:49 PM

ఆయుష్‌ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు ఆదివారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

అనంతపురం మెడికల్‌ : ఆయుష్‌ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు ఆదివారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. జేసీ–2 ఖాజామొహిద్దీన్‌ పర్యవేక్షణలో ఆయుష్‌ రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ (ఆర్‌డీడీ) వెంకట్రామ్‌ నాయక్, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ డీపీఎం డాక్టర్‌ అనిల్‌కుమార్, డీఐఓ డాక్టర్‌ పురుషోత్తం సమక్షంలో బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఆయుర్వేద, హోమియో, యునానీ ఆస్పత్రుల్లో పని చేస్తున్న 24 మంది కాంపౌండర్లు, 17 మంది క్లాస్‌–4 ఉద్యోగులకు బదిలీ చేశారు. ఎన్జీఓ సంఘం లేఖలతో వచ్చిన ఇద్దరు ఉద్యోగులకు యథాస్థానాల్లో ఉంచారు. కార్యక్రమంలో ఆయుష్‌ వైద్యులు డాక్టర్‌ తిరుపతినాయుడు, డాక్టర్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement