తక్షణమే వారి వేతనాలు చెల్లించండి: హైకోర్టు | Hyderabad High Court directs AP govt Over Ayush Employees Salaries | Sakshi
Sakshi News home page

తక్షణమే వారి వేతనాలు చెల్లించండి: హైకోర్టు

Aug 22 2017 8:05 PM | Updated on Aug 31 2018 8:34 PM

ఆయుష్‌ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.

సాక్షి, అమరావతి: ఆయుష్‌ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఆయుష్‌ శాఖలో పనిచేస్తున్న సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించడమే కాకుండా వారికి ఇవ్వాల్సిన 17 నెలల వేతనాలు ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో ఆయుష్‌ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం తక్షణమే వారికి వేతనాలు చెల్లించి, వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని సర్కారును ఆదేశించింది. డాక్టర్లను నియమించని కారణంగా కాంపౌండర్లను, ఆర్డర్లీ నర్సింగ్‌ సిబ్బందిని ఎలా తొలగిస్తారని సర్కారు మొట్టిక్కాయలు వేసింది. కోర్టు తీర్పు అనంతరం ఆయుష్‌ శాఖ ఉద్యోగులు హనుమంతరెడ్డి, సురేష్‌గుప్తా, లక్ష్మినారాయణ, రాధకుమారి తదితరులు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆయుష్‌ ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement