ఆటో బోల్తా : ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు | Auto Jump..Two Students Injured | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు

Aug 26 2016 11:29 PM | Updated on Nov 9 2018 4:44 PM

కొల్లాపూర్‌ : ఆటో బోల్తా పడటంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ముక్కిడిగుండానికి చెందిన నందు, రుషి కొల్లాపూర్‌ పట్టణంలోని రెయిన్‌బో ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం ఆటో పాఠశాలకు వెళుతుండగా గ్రామ శివారులోకి చేరుకోగానే అదుపుతప్పి బోల్తా పడింది.

కొల్లాపూర్‌ : ఆటో బోల్తా పడటంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ముక్కిడిగుండానికి చెందిన నందు, రుషి కొల్లాపూర్‌  పట్టణంలోని రెయిన్‌బో ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం ఆటో పాఠశాలకు వెళుతుండగా గ్రామ శివారులోకి చేరుకోగానే అదుపుతప్పి   బోల్తా పడింది. దీంతో వారిద్దరికీ తీవ్ర గాయాలు కాగా చుట్టుపక్కలవారు గమనించి వెంటనే అంబులెన్స్‌లో కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement