ఆటోను ఢీకొట్టిన కారు | auto hitting by car | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన కారు

Dec 14 2016 12:07 AM | Updated on Sep 4 2017 10:38 PM

ఆటోను ఢీకొట్టిన కారు

ఆటోను ఢీకొట్టిన కారు

కొవ్వూరు : పట్టణంలోని టోల్‌గేట్‌ జంక్షన్ సమీపంలో రోడ్డు కం రైలు వంతెనపై ఎదురుగా వచ్చిన మోటార్‌సైకిల్‌ను తప్పించే క్రమంలో కారు ఆటోను ఢీకొట్టింది.

కొవ్వూరు : పట్టణంలోని టోల్‌గేట్‌ జంక్షన్ సమీపంలో రోడ్డు కం రైలు వంతెనపై ఎదురుగా వచ్చిన మోటార్‌సైకిల్‌ను తప్పించే క్రమంలో కారు ఆటోను ఢీకొట్టింది. కారు అదుపుతప్పి వంతెన దిగువకు వెళ్లి ఆగిపోయింది. ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ మేకల శ్రీనివాసరావు స్వల్పంగా గాయపడ్డాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఏలూరి ప్రభాకరావు, కమల కుమారి సురక్షితంగా బయటపడ్డారు. చాగల్లు నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న ఆటోను రాజమహేంద్రవరం నుంచి పెనకనమెట్ట వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈప్రమాదం జరిగింది. రోడ్డు కం రైలు వంతెన అప్రోచ్‌రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో కారు రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో సిమెంట్‌ దిమ్మె కారు దిగువున ఇరుక్కుంది. ఎదురుగా చెట్ల కొమ్మల్లో ఇరుక్కోవడంతో కారు ముందుకు వెళ్లలేదు. కారుకు దిగువన తాటాకిళ్లు ఉన్నాయి.  కారు అదుపు తప్పితే ఇళ్లల్లోకి దూసుకెళ్లి ఉండేది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement