రూ.5 లక్షల నగదు ఆటోలో మరిచిన రియల్టర్ | Auto driver robbery cash bag in guntur | Sakshi
Sakshi News home page

రూ.5 లక్షల నగదు ఆటోలో మరిచిన రియల్టర్

Jul 6 2016 10:26 AM | Updated on Sep 4 2017 4:16 AM

రూ. 5 లక్షల నగదు సంచిని ఆటోలో మర్చిపోయాడు సుబ్బారావు అనే రియల్టర్.

గుంటూరు : రూ. 5 లక్షల నగదు సంచిని ఆటోలో మర్చిపోయాడు సుబ్బారావు అనే రియల్టర్. ఆ విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్ సదరు నగదు సంచితో ఉడాయించాడు. ఆటోలో నగదు మరిచిపోయిన సంగతి గుర్తుకు వచ్చిన సుబ్బారావు వెంటనే మరో వాహనంలో ఆటో కోసం గాలించాడు. అయినా ఫలితం లేకుండా పోయింది.

దీంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన గుంటూరు నగరంలో బుధవారం చోటు చేసుకుంది. సుబ్బారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా నగరంలోని వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement