కాగ్నా నదిని పరిశీలించిన అదనపు ఎస్పీ | ASP visits kagna river | Sakshi
Sakshi News home page

కాగ్నా నదిని పరిశీలించిన అదనపు ఎస్పీ

Sep 20 2015 12:41 PM | Updated on Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లాలోని కాగ్నా నదిలో సోమవారం వినాయక నిమజ్జనం చేయనున్నారు.

యాలాల : రంగారెడ్డి జిల్లాలోని కాగ్నా నదిలో సోమవారం వినాయక నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అందులోభాగంగా ఆదివారం జిల్లా అదనపు ఎస్పీ యాలాల సమీపాన గల కాగ్నా నదిని ఆయన పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన పోలీసు సిబ్బందికి సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement