20న ఏపీసెట్ కీ విడుదల | Sakshi
Sakshi News home page

20న ఏపీసెట్ కీ విడుదల

Published Sun, Sep 18 2016 7:56 PM

apset key will release on september 10

ఏయూక్యాంపస్ (విశాఖ): రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న నిర్వహించిన రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఏపీసెట్) -2016 ప్రాథమిక కీని ఈనెల 20న ఏపీసెట్ వెబ్‌సైట్ www.apset.net.in లో ఉంచుతున్నట్లు ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక కీ ని ఈనెల 25 వరకూ వెబ్‌సైట్‌లో ఉంచుతారు.

అభ్యర్థులు పరీక్షలో వచ్చిన ప్రశ్నలపై ఎటువంటి సందేహాలున్నా ఈనెల 25వ తేదీలోగా apsetau@gmail.com మెయిల్ ఐడీకి పూర్తి వివరాలు పంపాలి. విద్యార్థులు తమ పరీక్ష హాల్‌టికెట్, ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానాన్ని తెలుపుతూ సంబంధిత ఆధారాలను ఈమెయిల్‌కు జతపరచాలి. 25వ తేదీ సాయంత్రం 5 గంటల తరువాత వచ్చే అభ్యర్థనలు స్వీకరించరు. 
 
 

 
Advertisement
 
Advertisement