అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2017–18 సంవత్సరానికి గాను పారా మెడికల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు.
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2017–18 సంవత్సరానికి గాను పారా మెడికల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. దరఖాస్తులు http://dme.ap.nic.in, www.appmb.org.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 5వ తేదీలోపు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. మొదటి కౌన్సెలింగ్ సెప్టెంబర్ 15న, రెండో కౌన్సెలింగ్ సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెడికల్ కళాశాలలో ఉంటుందన్నారు. కోర్సుల వారీగా డీఎంఎల్‌టీ–10, డీఓఏ–10, డీఏఎన్‌ఎస్–30, డీఎంఐటీ–10, డీఈసీజీ–3, డీఆర్‌జీఏ–6, డీడీఆర్‌ఎ–3 ఖాళీలున్నట్లు తెలిపారు. ఇంటర్ అర్హత ఉన్న వారంతా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు.