ఉద్యోగుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య తీరును నిరసనగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు బుధవారం నుంచి ఆందోళన చేపడుతున్నట్లు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ. సురేష్ తెలిపారు.
ఏపీజీబీ ఉద్యోగుల ఆందోళన బాట
Sep 7 2016 12:01 AM | Updated on Sep 27 2018 9:07 PM
– 12 నుంచి రిలే నిరాహార దీక్షలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యోగుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య తీరును నిరసనగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు బుధవారం నుంచి ఆందోళన చేపడుతున్నట్లు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ. సురేష్ తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని మంగళవారం విలేకర్లకు వివరించారు. సమాన పనికి సమాన వేతనం అన్న నినాదమే గ్రామీణ బ్యాంకుల వ్యవస్థకు పునాదిగా ఉన్నపుడు సిండికేట్ బ్యాంకు యాజమాన్యంలోని మూడు గ్రామీణ బ్యాంకుల్లో ప్రథమ గ్రామీణ, కర్ణాటక గ్రామీణ బ్యాంకులు ఇంక్రిమెంట్లను పునరుద్దరించగా ఏపీజీబీ ఏక పక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 7న సామూహిక నిరహార దీక్షలు, 12 నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. యాజమాన్యం తీరులో మార్పు రాకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.ర్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 61 మందిని జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేశామని, వీరంతా ఉదయం 9 గంటలకే సునయన ఆడిటోరియానికి చేరుకోవాలని సూచించారు.
Advertisement
Advertisement